₹200 నుంచి ₹1000 వరకు వసూలు – ప్రైవేట్ పాఠశాలల దౌర్జన్యం?
డబ్బులు ఇవ్వకపోతే జులుం… ఫేర్వెల్ పేరుతో ఫీజుల వర్షం
విద్యార్థులపై ఆర్థిక భారం – తల్లిదండ్రుల్లో ఆగ్రహం
ఫేర్వెల్ వేడుకలా? లేక వసూళ్ల వేడుకా?

బోధన్:
సాలూరు మండలం, బోధన్ మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలలో ఫేర్వెల్ పార్టీ పేరుతో నిర్వాహకులు విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి ₹200 నుంచి ₹1000 వరకు బలవంతంగా వసూలు చేస్తున్నట్టు సమాచారం.
డబ్బులు చెల్లించని విద్యార్థులపై ఒత్తిడి, అవమానాలు, జులుం చేస్తున్నారనే ఆరోపణలు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాల ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం ఖర్చులతో సతమతమవుతున్న తల్లిదండ్రులపై ఇది మరింత ఆర్థిక భారం మోపుతున్నట్టు తెలుస్తోంది.
“ఫేర్వెల్ పార్టీ స్వచ్ఛందంగా నిర్వహించాలి గానీ, బలవంతపు వసూళ్లు చేయడం ఏమిటి?” అంటూ పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ఆనంద వేడుకగా ఉండాల్సిన కార్యక్రమాన్ని వసూళ్ల సాధనంగా మార్చడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








