May 15, 2026 11:52 pm

V1News Telangana

ఇల్లరికం తెచ్చుకున్న అత్తపై అల్లుడి అత్యాచారం – ఆపై హత్య*

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో ఘటన..

తాగుడుకు బానిసైన అల్లుడి వల్లే ఘోరం
కుమార్తెను రక్షించేందుకు అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్న అత్త
ఇల్లరికం తెచ్చుకోవడమే ఆమె పాలిట శాపంగా మారింది
భార్య ఇంట్లో లేకపోయిన సమయంలో అఘాయిత్యం
రోజు రోజుకి సమాజంలో మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎవరిని ఏ విధంగా హింసిస్తారు అనేది తెలియకుండా పోతుంది. వావి వరసలు మరిచి పశువుల మాదిరిగా ప్రవర్తిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.తాజాగా సభ్య సమాజం నివ్వెరపోయే ఒక ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

అత్తపై అల్లుడి అత్యాచారం, ఆపై హత్య

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇల్లరికం తెచ్చుకున్న అత్త పైన అల్లుడు హత్యాచారం చేసిన ఘటన అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక ఈ ఘటన వివరాలలోకి వెళితే కన్నబిడ్డను ఇచ్చి పెళ్లి చేయడం మాత్రమే కాకుండా ఇల్లరికం తెచ్చుకొని పెంచి పోషిస్తున్న అత్త పైనే ఓ అల్లుడు అత్యాచారం చేసి ఆపైన ఆమెను హతమార్చిన ఘటన చోటు చేసుకుంది.

అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్న అత్త

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఒక మహిళ తన కుమార్తెకు కొన్నాళ్ల క్రితం తిమ్మాజీపేట మండలానికి చెందిన మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. అల్లుడు తాగుడుకు బానిస కాగా కుమార్తెను వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంది.

ఇల్లరికం తెచ్చుకోవడమే ఆమె పాలిట శాపం

తన దగ్గర ఉంటే కనీసం మారతాడని, వారిద్దరిని పోషించగలుగుతాను అని భావించిన అత్త ఇల్లరికం తెచ్చుకోవడమే ఆమె పాలిట శాపమైంది. ఇటీవల భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో భార్య తన బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లుడు అత్తపైన అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను కొట్టి చంపాడు. ఇక సోమవారం రోజు ఇరుగుపొరుగు వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మానవ సంబంధాలపై ఆలోచించేలా చేస్తున్న ఘటన

మృతురాలి రెండో కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఆపై పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడమే కాకుండా ఇల్లరికం కూడా తెచ్చుకొని తిండిపెట్టి పోషిస్తున్న అత్తపైన అత్యాచారం చేసిన అల్లుడు చివరకు ఆమెను హతమార్చి చేసిన ఘాతకం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇది ప్రతి ఒక్కరిని మానవ సంబందాలపైన, మానవతా విలువలపైన ఆలోచించేలా చేస్తుంది

Vaibhav Ghate
Author: Vaibhav Ghate

Vaibhav Ghate Nanded Dist Reports.mobile no :-7972118734

Leave a Comment

Read more
Read more