May 16, 2026 3:22 am

V1News Telangana

రూ.20 కోట్లతో నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ భవనం ప్రారంభం – క్రీడా సామాగ్రికి రూ.20 లక్షల మంజూరు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మైనారిటీ రెసిడెన్షియల్ భవనం ప్రారంభం – క్రీడా సామాగ్రికి రూ.20 లక్షల మంజూరు
బోధన్‌లో రూ.20 కోట్ల భవనం ప్రారంభం… మైనారిటీ విద్యకు కొత్త ఊపిరి
మైనారిటీ విద్యాభివృద్ధికి పెద్ద అడుగు – రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం
విద్యతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం – బోధన్‌లో సుదర్శన్ రెడ్డి ప్రకటన
మైనారిటీ విద్యార్థులకు వరం – ఆధునిక సదుపాయాలతో రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం..

బోధన్ టౌన్, జనవరి 25:
పట్టణంలోని పాండు ఫారంలో సుమారు రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ భవనాన్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
విద్యతో పాటు విద్యార్థుల శారీరక దారుఢ్యం పెంపొందించేందుకు క్రీడలు అవసరమని, అందుకోసం కావలసిన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఈ నేపథ్యంలో క్రీడా సామాగ్రి కొనుగోలు కోసం బాలబాలికల విభాగాలకు చెరో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లను పూర్తిస్థాయిలో నిర్వహించాలని, విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ విద్యాసంస్థల ప్రారంభం మైనారిటీ విద్యార్థులకు కొత్త అవకాశాలను కల్పించి, భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హుందాన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్ము శరత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె.కృష్ణవేణి, ఆర్‌ఎల్‌సీ అబ్దుల్ బషీర్, రీజినల్ ఆఫీసర్లు షేక్ హైమద్ రియా మహమ్మద్ అమిద్దీన్, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం. జావిద్, తెలంగాణ మైనారిటీ గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more