May 16, 2026 3:21 am

V1News Telangana

హనుమాన్ మందిరం వద్ద ఇచ్చిన హామీ ఏమైంది? 45 రోజులు గడిచినా బోరు పనులు ప్రారంభం కానందుకు పదో వార్డు మెంబర్‌పై వార్డ్ సభ్యుడు ఆగ్రహం..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

జిల్లా నిజామాబాద్ సాలుర మండలం:
ఎన్నికల సమయంలో హనుమాన్ మందిరం ఎదుట నిలబడి “ఎలక్షన్ గెలిచిన మరునాడే బోరు కొట్టిస్తా” అని హామీ ఇచ్చిన పదో వార్డు మెంబర్ ఇప్పటివరకు ఆ మాటను నెరవేర్చకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరిగి 45 రోజులు దాటినా బోరు పనులు ప్రారంభం కాకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
మాట ఇచ్చి మాట తప్పడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. “మేము ఓటర్లం, మాకు మా సమస్యలపై పరిష్కారం కావాలి. హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత బాధ్యత మరిచిపోవడం సరైంది కాదు” అని పదో వార్డు సభ్యుడు కన్నె భాస్కర్ పేర్కొన్నారు.
కాలనీ వాసులు, కన్నె భాస్కర్ ఆధ్వర్యంలో మాట్లాడుతూ, ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయడం తగదని, దేవాలయం ముందు ఇచ్చిన మాటను గౌరవించాల్సిన బాధ్యత వార్డు మెంబర్‌పై ఉందని స్పష్టం చేశారు.

ఇప్పటికైనా వెంటనే బోరు కొట్టించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపకపోతే ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చేస్తామని హెచ్చరించారు.
“పేరుకి పదవి కాదు, పనితోనే ప్రజల నమ్మకం నిలబడుతుంది” అని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తూ, ఎన్నికల్లో గెలిచిన గర్వంతో ప్రజలను విస్మరించవద్దని సూచించారు. వెంటనే బోరు పనులు ప్రారంభించి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, లేకపోతే ప్రజల ఆగ్రహానికి వార్డు మెంబరే బాధ్యత వహించాల్సి ఉంటుందని గ్రామ ప్రజలు స్పష్టంగా తెలియజేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more