తెలంగాణజాగృతి వ్యవస్థాపకురాలు కవితక్క గారు త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పార్టీకి “సింహం” గుర్తు ఉంటుందని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రజాక్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, స్వాభిమానాన్ని కాపాడేలా కొత్త రాజకీయ వేదిక అవసరమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా గుర్తించి, వేగంగా పరిష్కరించే దిశగా ఈ పార్టీ పని చేస్తుందని ఆయన అన్నారు.
కవితక్క గారి ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీపై ఆసక్తి పెరుగుతోందని నాయకులు తెలిపారు.
అదేవిధంగా, 38 వార్డులలో కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నట్లు కూడా ఈ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఈ కొత్త రాజకీయ పార్టీ ముందుకు సాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








