నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ‘డాడీస్ రోడ్ యాప్’ స్టిక్కర్ ను డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డిటిసి) శ్రీమతి దుర్గా ప్రమీల గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రమాదాలు జరిగే సందర్భాల్లో మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ యాప్‌లోని క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,” అని అన్నారు…
ఈ యాప్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే, ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు సమాచారం చేరవచ్చు. అలాగే, రక్తం అవసరమైన సమయంలో సమాచారం, వైద్య సేవల సమాచారం, వాహనాలు రాంగ్ పార్కింగ్ చేసినప్పుడు అలర్ట్‌లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
వాహనదారుల కోసం ఈ యాప్ ఎనిమిది రకాల ప్రయోజనాలను కలిగి ఉందని డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇందులో ప్రమాద సందేశం పంపటం, రక్త నిధి సమాచారం, పార్కింగ్ సమస్యల నివేదికలు, పత్రములు భద్రపరచుట, రిమైండర్లు, లాక్ హెచ్చరికలు, టోయింగ్ హెచ్చరికలు వంటి సదుపాయాలున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్, కిరణ్ కుమార్, ఏవో ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఈ QR స్టిక్కర్ వాహనాలకు అమర్చుకోవాలని సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






