June 18, 2026 12:41 am

V1News Telangana

నూతన కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

– ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన నిర్వహించిన హైకోర్టు న్యాయమూర్తులు

– న్యాయస్థానాలు దేవాలయాలతో సమానమని అభివర్ణన

– నూతన భవన నిర్మాణ రూపకల్పన పట్ల సంతృప్తి వ్యక్తం

– బాన్సువాడ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక జడ్జికి సూచనలు

– హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్ రావ్, లక్ష్మీనారాయణ

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో శనివారం రోజు జూనియర్ సివిల్ కోర్టు మరియు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నూతన భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు పురోహితుల సమక్షంలో వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్ రావ్, లక్ష్మీనారాయణ లు మాట్లాడుతూ న్యాయస్థానాలు దేవాలయాలతో సమానమని అభివర్ణించారు. ఇక్కడ బాధితులందరికీ న్యాయం జరుగుతుందన్నారు. భవన నిర్మాణం న్యాయవాదులకు, కక్షిదారులకు అందరికీ అన్ని సౌకర్యాలతో , నూతన హంగులతో నిర్మించే విధంగా రూపకల్పన చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బాన్సువాడ కోర్టు పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక న్యాయమూర్తికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, బాన్సువాడ జడ్జి టీఎస్పీ భార్గవి, డీఎస్పీ సత్యనారాయణ, బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మూర్తి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Comment

Read more
Read more