తెలంగాణ పోరాట చరిత్రలో చెరగని ముద్ర.. చాకలి ఐలమ్మ..
సాలూర: సాలూరలో వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రజక సంఘం జెండాను ఎగురవేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన ధైర్యవంతురాలిగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని వక్తలు పేర్కొన్నారు. సామాజిక అసమానతలు, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య, గ్రామ పెద్దలు ఇల్తెపు శంకర్, అల్లె రమేష్, సొక్కం రవి, శివకాంత్ పటేల్, కండెల సంజీవ్, రజక సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు అశోక్‌తో పాటు రజక సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న రజక సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







