ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు ఘనంగా అన్నదానం…
బోధన్, సెప్టెంబర్ 24: బోధన్ పట్టణంలోని సిల్వర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిల్వర్ గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
వినాయకుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. పూజా కార్యక్రమాల అనంతరం మండలి ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా గణేష్ మండలి అధ్యక్షుడు ప్రమోద్ కదం మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గణనాథుని ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూజా కార్యక్రమాలు, అన్నదాన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.


కార్యక్రమంలో గణేష్ మండలి ప్రతినిధులు బాబయ్య అప్ప, కైలాష్ అప్ప, నర్సింగ్ అప్ప, శ్రీకాంత్ షిండే, నందు అప్ప, కిషోర్ చారి, సంతోష్ పటేల్, శివ, కుషాల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగస్వాములైన భక్తులు, నిర్వాహకులను పలువురు అభినందించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







