ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు యువత ఉద్యమమే కారణం – జెన్‌జీకి రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన సీఎం
హైదరాబాద్, జూలై 25:
విద్యార్థులపై ఉద్యమాల సందర్భంగా నమోదైన అన్ని కేసులను సోమవారం లోగా ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉద్యమంలో యువత ఉత్సాహంగా పాల్గొనడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని ఆయన పేర్కొన్నారు.
ఉద్యమాల సమయంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జెన్‌జీ (Gen Z) యువతలో విజయోత్సాహం కనిపిస్తోందని, అయితే ఈ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవడం లేదని స్పష్టం చేశారు.

కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు యువత ఉద్యమమే ప్రధాన కారణమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్థుల పోరాటానికి రాజకీయ పార్టీలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలు మద్దతు తెలిపాయని ఆయన అన్నారు.
యువతకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సీఎం, ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు ఉన్న నేపథ్యంలో, 21 ఏళ్లు నిండిన యువతకు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత చురుకైన పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవడం కాలానుగుణ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








