న్యూఢిల్లీ, జూలై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో దేశ యువత భవిష్యత్తు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే తన నిర్ణయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యంపై తనకు అచంచల విశ్వాసం ఉందని, దేశ యువత ఆశయాలు, ఆకాంక్షలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తానని తెలిపారు.
గత పది రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్న ఆయన, యువతను అపోహలు, దుష్ప్రచారాల బారిన పడనివ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపిన ధర్మేంద్ర ప్రధాన్, మంత్రిత్వ శాఖ అధికారులు, సహచర మంత్రులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. దేశసేవే తన జీవిత లక్ష్యమని, శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భవిష్యత్తులోనూ దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు సేవలు అందిస్తూనే ఉంటానని పేర్కొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







