కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ – అన్నదానం, బాణాసంచాతో సంబరాలు – కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల భారీ పాల్గొనడం
కోటగిరి, జూలై 23 (వి1 న్యూస్):
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలుచోట్ల భాస్కర్ రెడ్డి కటౌట్లను ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
కోటగిరి బస్టాండ్ ఆవరణతో పాటు అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వారసుడిగా భాస్కర్ రెడ్డి ప్రజాసేవలో ముందంజలో కొనసాగుతూ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు సేవ చేయాలని శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న భాస్కర్ రెడ్డి భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పొందాలని నాయకులు, అభిమానులు పేర్కొన్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోటగిరి మండల మైనార్టీ నాయకుడు జుబేర్ బాయ్ మాట్లాడుతూ, పోచారం కుటుంబంతో తనకు ఎన్నో ఏళ్లుగా ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. ప్రజలకు ఆ కుటుంబం అందిస్తున్న సేవలను ఎప్పటికీ మరువలేనని, పోచారం కుటుంబానికి తాను రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, వైస్ చైర్మన్ కులకర్ణి అనిల్, కోటగిరి, కొత్తపల్లి గ్రామాల చైర్మన్లు కూచి సిద్దు, డా. సునీల్, మాజీ ఉమ్మడి మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ పత్తి లక్ష్మణ్, మాజీ నాయకులు అబ్దుల్ హమీద్, మైనార్టీ నాయకుడు జుబేర్ బాయ్, మాజీ కోఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్, బాబు ఖాన్ ఇస్మాయిల్, సీనియర్ నాయకులు ఖాదర్తో పాటు కోటగిరి, పోతంగల్ మండలాల పరిధిలోని సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








