హైదరాబాద్, జూలై 25:
రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ, నిరోధక చర్యలపై శనివారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగం, సరఫరాపై పూర్తిస్థాయి బాధ్యత ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలదేనని సీఎం స్పష్టం చేశారు. క్యాంపస్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన ఏ ఘటన జరిగినా సంబంధిత యాజమాన్యాన్నే బాధ్యులుగా పరిగణించేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు.

విద్యాసంస్థలకు తగిన అధికారాలతో పాటు స్పష్టమైన బాధ్యతలు కూడా అప్పగించాలని పేర్కొన్నారు. క్యాంపస్ వెలుపల జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించే విధంగా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.
విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా అందించేందుకు విద్యాసంస్థల ప్రాంగణంలో టోల్‌ఫ్రీ నంబర్లు, ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు మరింత సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







