న్యూఢిల్లీ, జూలై 24 (V1 న్యూస్): దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టేందుకు రూపొందించిన పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడే వ్యక్తులు, ముఠాలు, సంబంధిత సంస్థలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
చట్టం ప్రకారం, పేపర్ లీకేజీ నేరానికి పాల్పడిన వారికి
గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి.

ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా నిర్వహించే నియామక, ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడటంతో పాటు, అభ్యర్థులకు న్యాయం జరిగేలా పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయత మరింత బలోపేతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







