-- --

బోధన్‌లో బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశం.. ఎస్‌ఐఆర్ నమోదు వేగవంతం చేయాలని పిలుపు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ టౌన్, జూలై 25 (వి.1 న్యూస్):

బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం శనివారం మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో వారి నివాసంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి నమోదు పూర్తయ్యేలా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని కోరారు.

సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతం చేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా ఇన్‌చార్జి వి.జీ. గౌడ్, నిజామాబాద్ ఇన్‌చార్జి సుమిత్ర ఆనంద్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ విట్టల్, మండల అధ్యక్షులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more