న్యూఢిల్లీ, జూలై 25: కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
విద్యా రంగంలో కొనసాగుతున్న పలు కీలక సంస్కరణలు, జాతీయ విద్యా విధానం (NEP) అమలు, ఉన్నత విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై కొత్త మంత్రి దృష్టి సారించే అవకాశముంది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నిర్ణయంతో ప్రహ్లాద్ జోషికి ఈ అదనపు బాధ్యతలు అప్పగించగా, విద్యాశాఖలో పరిపాలనా కొనసాగింపు మరియు విధానాల అమలుకు ఈ నిర్ణయం దోహదపడనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







