బోధన్, జూలై 24 (వి1 న్యూస్):
బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మన్‌పల్లి గ్రామంలో శుక్రవారం “మన ఊరు–మన భద్రత–మన బాధ్యత” పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్, బోధన్ రూరల్ ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు ప్రజా భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నిబంధనల పాటింపు, సైబర్ నేరాల నుంచి రక్షణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవల వినియోగం, అలాగే పాముకాటు, విద్యుత్ షాక్ వంటి ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పోలీసులు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







