బోధన్, జూలై 23 (వి1 న్యూస్):
బోధన్ పట్టణంలోని బ్రాహ్మణగల్లిలో ఉన్న శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన 72 గంటల అఖండ రుద్రాభిషేక మహోత్సవం గురువారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా ముగిసింది.
సోమవారం ప్రారంభమైన ఈ మహోత్సవంలో మూడు రోజుల పాటు ప్రత్యేక రుద్రాభిషేకాలు, వేద మంత్రోచ్చారణలు, విశేష పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. మహోత్సవంలో పాల్గొనేందుకు బోధన్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు.

మహోత్సవం ముగింపు సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వేదఘోషలు, భక్తుల నామస్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.
మహోత్సవాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సేవకులు, దాతలు, భక్తులకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







