Post Views: 127
పార్లమెంట్ ఘటనను ఖండిస్తూ బోధన్‌లో బీజేపీ ధర్నా.. అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో
బోధన్, జూలై 23 (వి1 న్యూస్):
ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా పార్లమెంట్ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘటనలను ఖండిస్తూ, బోధన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోక నిర్వహించారు. దేశ పార్లమెంట్, ప్రధానమంత్రి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు శాంతియుతంగా నిర్వహించాల్సి ఉంటుందని, దేశ గౌరవం, రాజ్యాంగ సంస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని అన్నారు.
ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో కొందరు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలో పోలీసులపై, మీడియా ప్రతినిధులపై దాడులు జరిగినట్లు పేర్కొంటూ, ఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను కోరారు. విద్యార్థి ఉద్యమాల పేరుతో హింసాత్మక చర్యలకు పాల్పడటం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, మాజీ కౌన్సిలర్లు గొడుగు ధర్మపురి, మాసిని వినోద్, పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జాపూర్ అరవింద్, ఉపాధ్యక్షుడు గాదె సందీప్, కార్యదర్శి దేవకాటే శివరాజ్, సీనియర్ నాయకులు హన్మాండ్లు చారి, పెరక వెంకటేష్, పప్పుల వేణు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గమనిక: పై వార్త బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలు, డిమాండ్ల ఆధారంగా రూపొందించబడింది. ఆరోపణలకు సంబంధించి ఇతర పక్షాల స్పందన అందుబాటులో లేదు
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







