Post Views: 19
V1.న్యూస్, బోధన్, జూలై 14: బోధన్ మండలంలోని పెంటఖుర్దూ గ్రామంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరేలా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రెండు నూతన బోర్‌బావులను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ వెంకటేష్ నాయకత్వంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలో ఒకటి, వైకుంఠధామం వద్ద మరొక బోర్‌బావిని గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) నిధులతో ఏర్పాటు చేశారు.
ఈ బోర్‌బావులు అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల్లో నెలకొన్న నీటి కొరతకు గణనీయంగా ఉపశమనం లభించిందని గ్రామస్తులు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్న గ్రామ సర్పంచ్ వెంకటేష్, ఉపసర్పంచ్ వినోద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభాష్‌లను గ్రామ ప్రజలు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినోద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభాష్, గ్రామస్తులు గంగులు, జయరాం, పరశురాం, రాజు, కుర్మా లక్ష్మణ్, గంగారాం, జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








