-- --

శభాష్ రుద్రూర్ పోలీసులు.. రోడ్డు మరమ్మత్తుల వద్ద ప్రమాదాలు నివారించేందుకు చొరవ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రుద్రూరు, నిజామాబాద్ జిల్లా:

నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తుల పనుల సందర్భంగా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రుద్రూర్ పోలీసులు ప్రశంసనీయమైన చర్యలు చేపట్టారు.
రోడ్డు మరమ్మత్తులు నిర్వహిస్తున్న ప్రదేశంలో కాంట్రాక్టర్ సంస్థలు తప్పనిసరిగా ప్రమాద సూచిక బోర్డులు, హెచ్చరికలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఏర్పడింది.
ఈ పరిస్థితిని గుర్తించిన రుద్రూర్ పోలీసులు వెంటనే స్పందించి, మరమ్మత్తులు జరుగుతున్న మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసి, వాహనాలను ప్రత్యామ్నాయ రహదారి వైపు మళ్లిస్తూ ట్రాఫిక్‌ను సురక్షితంగా నియంత్రించారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా చర్యలు తీసుకున్నారు.
రోడ్డు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు భద్రతా ప్రమాణాలపై నిర్లక్ష్యం ప్రదర్శించగా, పోలీసులు చొరవ తీసుకుని ప్రజల ప్రాణ భద్రత కోసం వ్యవహరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “శభాష్ రుద్రూర్ పోలీసులు” అంటూ వారి సేవలను అభినందిస్తున్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more