శేఖర్‌తో విభేదాలు లేవు.. అవన్నీ అవాస్తవం: జానీ మాస్టర్.
హైదరాబాద్, జూలై 13: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనకు, శేఖర్ మాస్టర్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల యూనియన్ సమావేశానికి సంబంధించిన చర్చలను కొందరు తప్పుగా ప్రచారం చేశారని ఆయన తెలిపారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ.. “నిన్న మా యూనియన్ సమస్యలపై చర్చ జరిగింది. అయితే శేఖర్ మాస్టర్‌తో నాకు ఎలాంటి గొడవ జరగలేదు. మేమంతా సోదరులమే. యూనియన్ అభివృద్ధి కోసమే అందరం కలిసి పనిచేస్తున్నాం” అని చెప్పారు.
ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. “ఆ వార్తలు చూసి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నన్ను అడిగారు. తర్వాత నేను, శేఖర్ మాస్టర్ చిరంజీవి గారి షూటింగ్‌లో కలుసుకుని పాత పాటల గురించి మాట్లాడుకున్నాం” అని వెల్లడించారు.
అలాగే, “మా డ్యాన్స్ మాస్టర్లకు హీరోలందరూ పూర్తి మద్దతుగా ఉంటారు. యూనియన్‌లో చిన్న చిన్న సమస్యలపై మాత్రమే చర్చలు జరుగుతాయి. వాటికి శేఖర్ మాస్టర్‌కు ఎలాంటి సంబంధం లేదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు” అని జానీ మాస్టర్ స్పష్టం చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







