-- --

బోధన్ డివిజన్ ప్రజావాణిలో 8 ఫిర్యాదులు స్వీకరణ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

భూ సమస్యలు, మంచినీటి వృథా, డ్రైనేజీ, మ్యుటేషన్, పాస్‌బుక్‌లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై వినతులు…

బోధన్, జూలై 13:
బోధన్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం డివిజన్ ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి సందర్భంగా మొత్తం 8 దరఖాస్తులు స్వీకరించారు. కుటుంబ భూ వివాదం, బోధన్ పట్టణంలో మంచినీటి వృథా, డ్రైనేజీ సమస్య, ఇల్లు మ్యుటేషన్‌కు సంబంధించిన రెండు దరఖాస్తులు, పాస్‌బుక్‌ల మంజూరుకు సంబంధించిన రెండు దరఖాస్తులు, అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరు కోరుతూ ఒక దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రజల సమస్యలను సంబంధిత శాఖల ద్వారా పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more