వర్షాలు సమృద్ధిగా కురవాలని కోటయ్య క్యాంపులో శ్రీ హనుమాన్ ఆలయంలో జలాభిషేకాలు…
వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు.. కోటయ్య క్యాంపు హనుమాన్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో జలాభిషేకాలు
జూలై 14: వర్ని మండలం :కోటయ్య క్యాంపు గ్రామంలోని శ్రీ సువర్చల దేవి సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం భక్తిశ్రద్ధలతో జలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని భక్తులు ప్రత్యేకంగా ప్రార్థించారు.
ఉదయం నుంచే గ్రామ ప్రజలు, హనుమాన్ స్వామి భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని జలాభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
ఈ పుణ్యకార్యక్రమంలో అంతం శంకర్, బుర్ర స్వామి గౌడ్, శీలమంతుల నందేశ్, బంజర రజినీకాంత్, నీలం నాగరాజు, వరికుప్పల మైసయ్య, పెనుబర్తి శ్రీనివాసరావు, రిపోర్టర్ పి. నాగభూషణం తదితర భక్తులు పాల్గొన్నారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







