“ప్రజల గోడు వినే పాలన… న్యాయం అందించే పరిపాలన.”
నిజామాబాద్, జూలై 6: నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 32 ఫిర్యాదులను పోలీస్ కమిషనర్ స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా ఆలకించిన కమిషనర్, వాటిని చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లు (సీఐలు), సబ్ఇన్స్పెక్టర్లు (ఎస్ఐలు)కు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల స్థితిగతులను తెలుసుకుని, పరిష్కారానికి తగిన సూచనలు చేశారు.
ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీసులను సంప్రదించి తమ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, పారదర్శకమైన సేవలను అందించడం జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వెల్లడించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







