బోధన్ ఎడ్యుకేషన్ హబ్ ప్రతిష్ఠను కాపాడాలని BRSV, BVF, GVS నాయకుల విజ్ఞప్తి
“విద్య వెలిగితేనే సమాజం వెలుగుతుంది… విద్యాసంస్థలను కాపాడటం అంటే భవిష్యత్తును కాపాడటమే.”
బోధన్, జూలై 4:
బోధన్ పట్టణంలో శనివారం BRSV, BVF, GVS (గిరిజన విద్యార్థి సంఘాలు) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు వడ్ల సతీష్ చారి, జాదవ్ ప్రవీణ్ నాయక్, సిరివెసు సంతోష్ మాట్లాడుతూ బోధన్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ పట్టణాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ విద్యా కేంద్రంగా (ఎడ్యుకేషన్ హబ్) తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు వ్యక్తిగత స్వలాభాల కోసం విద్యాసంస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. విద్యార్థి సంఘాలు విద్యార్థులు, యాజమాన్యాల మధ్య వారధిగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, సమస్యలను సాకుగా చేసుకుని విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడకూడదని సూచించారు.
బోధన్ విద్యాసంస్థలపై ప్రతికూల ప్రచారం కొనసాగితే సమీప గ్రామాలు, మండలాలు, జిల్లాల నుంచి విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో విద్యాసంస్థలతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న అనేక మంది జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

విద్యార్థి సంఘాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పనిచేయాలని, విద్యాసంస్థల అభివృద్ధికి తోడ్పడాలని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం నిర్మాణాత్మకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొర్రా బంతిలాల్ నాయక్, ఆఫనాన్తో పాటు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







