వర్షాలతో బురదమయమైన మార్గం – తక్షణ మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి
బోధన్, జూలై 4:
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులోని పాండు ఫారం సమీపంలో ఉన్న తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా చిత్తడిగా మారింది. రహదారి అంతా బురదమయంగా మారడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రహదారిపై కాలినడకన ప్రయాణించడం కూడా కష్టసాధ్యంగా మారగా, ద్విచక్ర వాహనాలు సహా ఇతర వాహనాల రాకపోకలు ప్రమాదకరంగా మారినట్లు స్థానికులు తెలిపారు. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వారు జారిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వందల కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో గురుకుల పాఠశాల భవనాలు నిర్మించినప్పటికీ, వాటికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారి దయనీయ స్థితిలో ఉండటం పట్ల స్థానికులు, తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో రహదారి పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు సురక్షితంగా పాఠశాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







