June 25, 2026 12:25 am

V1News Telangana

ఇందూరు మోడల్ హైస్కూల్‌లో విద్యార్థులకు సీపీ సాయి చైతన్య అవగాహన

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

డ్రగ్స్‌కు దూరం.. ట్రాఫిక్ నిబంధనలే రక్షణ

బోధన్, జూన్ 24: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. బోధన్ పట్టణంలోని ఇందూరు మోడల్ హైస్కూల్‌లో బుధవారం డ్రగ్స్ నివారణ, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని పేర్కొన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, చదువుపై పూర్తి దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. మంచి స్నేహితులను ఎంచుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు.

అలాగే రహదారి భద్రతపై మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. సీఐ విజయ్ బాబు మాట్లాడుతూ, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనల అమలు ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషోర్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని, రహదారి భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more