June 25, 2026 12:18 am

V1News Telangana

పుస్తకాల పేరిట దోపిడీ? బోధన్‌లో ప్రైవేట్ పాఠశాలలపై తల్లిదండ్రుల ఆగ్రహం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఫీజులకు అదనం.. బుక్స్, యూనిఫాంల పేరుతో భారీ భారం…

నిబంధనలకు విరుద్ధంగా నిర్దిష్ట కౌంటర్లలోనే కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు…

బోధన్, జూన్ 24:
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంతో పాటు పరిసర మండలాల్లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై పుస్తకాలు, యూనిఫాంల పేరిట అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠ్యపుస్తకాల విక్రయాలు జోరందుకోగా, కొందరు పాఠశాల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా తమకు అనుబంధంగా ఉన్న బుక్ కౌంటర్ల నుంచే పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఎల్‌కేజీ నుంచి ఉన్నత తరగతుల వరకు విద్యార్థుల కోసం పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, సాధారణ మార్కెట్ ధరలతో పోలిస్తే అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం, విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలు ఫీజుల వివరాలను నోటీసు బోర్డుపై ప్రదర్శించాల్సి ఉండగా, చాలా చోట్ల ఆ నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా, పాఠశాలల సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్ ద్వారా పుస్తకాలను విక్రయిస్తూ, బయట కొనుగోలు చేసిన పుస్తకాలను అనుమతించడం లేదన్న ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ఈ వ్యవహారంపై సంబంధిత విద్యాశాఖ అధికారులు సమగ్రంగా దృష్టి సారించి, ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల విక్రయాల విధానం, ఫీజుల వసూళ్లు, నిబంధనల అమలు అంశాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. పాఠశాలల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకుని, తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల ప్రశ్న

విద్య సేవనా… వ్యాపారమా?”

పాఠశాలల్లో విద్యాబోధన కంటే పుస్తకాలు, యూనిఫాంల విక్రయాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more