జూన్ 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ…
బోధన్, జూన్ 16: బోధన్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించనున్న నేపథ్యంలో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి నాగయ్య తెలిపారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అందాపూర్, డీఎన్‌టీ బెల్లాల్ పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాల బర్దిపూర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గాంధీనగర్ (ఉర్దూ మీడియం)ల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు కనీస అర్హతగా ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలని, బాల్య విద్య (Early Childhood Education), ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా (DPSE), నర్సరీ టీచర్ ట్రైనింగ్ (NTT/NTE) వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఆయా పోస్టుకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలని తెలిపారు. ఎంపికైన ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.8,000, ఆయాలకు నెలకు రూ.6,000 చొప్పున పది నెలలపాటు గౌరవ వేతనం అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాల మూడు సెట్ల జిరాక్స్ ప్రతులతో పాటు నిర్దేశిత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు బోధన్ మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఈఆర్సీ)లో సమర్పించాలని సూచించారు.
దరఖాస్తు ఫారాలు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న నందిని జిరాక్స్ సెంటర్‌లో అందుబాటులో ఉన్నాయని, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మండల విద్యాధికారి నాగయ్య విజ్ఞప్తి చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







