June 15, 2026 12:28 am

V1News Telangana

రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

విద్యార్థుల సౌకర్యార్థం అన్ని రూట్లలో స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీకి ఆదేశాలు..

రాష్ట్రవ్యాప్తంగా 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి జూన్ 15 (సోమవారం) నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో లక్షలాది మంది విద్యార్థులు రేపటి నుంచి తిరిగి పాఠశాల బాట పట్టనున్నారు.

విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల పాఠశాల సమయాలకు అనుగుణంగా బస్సుల రాకపోకలను ఏర్పాటు చేయాలని, గతంలో నిలిపివేసిన పాత రూట్లను పునరుద్ధరించాలని సూచించారు.

అదేవిధంగా బస్సుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే అదనపు ట్రిప్పులను కూడా నడపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, 2026–27 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని పాఠశాలలకు మొత్తం 227 పనిదినాలు ఉండనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు కొత్త విద్యాసంవత్సరానికి సన్నద్ధమవుతుండగా, పాఠశాలల ప్రారంభంతో విద్యా వాతావరణం మళ్లీ సందడిగా మారనుంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more