గ్రామ సుభిక్షం, కుటుంబాల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు…
బాసర, జూన్ 14:
నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతి అమ్మవారి నిలయమైన బాసర గ్రామానికి చెందిన భక్తులు కర్ణాటక రాష్ట్రంలోని పవిత్ర దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ఆధ్యాత్మిక యాత్రలో సింగారం యోగేష్, రమేష్ చారి, కొట్టే ఎల్లప్ప, దావు సంతోష్ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న అనంతరం దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

ఈ సందర్భంగా బాసర గ్రామంలోని కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని దత్తాత్రేయ స్వామివారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపి ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందిన భక్తులు, అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించి స్వగ్రామమైన బాసరకు తిరుగు ప్రయాణమయ్యారు.
దత్తాత్రేయ స్వామివారి కృపాకటాక్షాలతో ఈ యాత్ర భక్తి, ఆధ్యాత్మికతతో విజయవంతంగా సాగిందని యాత్రలో పాల్గొన్న భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







