June 14, 2026 11:15 pm

V1News Telangana

గర్భిణికి సకాలంలో ఏ నెగిటివ్ రక్తం అందజేత.. మానవత చాటిన ఉపాధ్యాయుడు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యువత రక్తదానానికి ముందుకు రావాలి : ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు..

కామారెడ్డి, జూన్ 14 :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న గౌతమి (28) అనే గర్భిణికి అత్యవసరంగా ఏ నెగిటివ్ రక్తం అవసరమవడంతో, ఎల్లారెడ్డికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోష్కే నాగరాజు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ విషయాన్ని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 12 కోట్ల యూనిట్ల రక్తం సేకరించబడుతున్నప్పటికీ, ప్రతిరోజూ లక్షలాది మంది రోగులకు రక్తం అవసరమవుతోందన్నారు. సకాలంలో రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒకసారి జీవితాంతం రక్తం అవసరమవుతుందని, వైద్య రంగం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. మానవతా భావంతో స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు రావడం ద్వారానే అనేక ప్రాణాలను కాపాడవచ్చని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.
రెడ్ క్రాస్, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాత గోష్కే నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more