June 14, 2026 11:14 pm

V1News Telangana

బాసర ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యతపై మళ్లీ ప్రశ్నలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బ్రేక్‌ఫాస్ట్‌లో వడ్డించిన ఆలూ కుర్మాలో బొద్దింక ప్రత్యక్షం.. విద్యార్థుల ఆందోళన..

బాసర, జూన్ 14 (ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) కళాశాలలో మరోసారి ఆహార నాణ్యతపై వివాదం చెలరేగింది. ఆదివారం ఉదయం ఈ-1, ఈ-2 మెస్‌లలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌గా చపాతీ, ఆలూ కుర్మా వడ్డించగా, ఆలూ కుర్మాలో బొద్దింక కనిపించడం కలకలం రేపింది.

ఆహారం తీసుకుంటున్న సమయంలో బొద్దింకను గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మెస్‌లో నాణ్యతలేని ఆహారం వడ్డించడం తమకు కొత్తేమీ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ నాసిరకం ఆహారమే అందిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో ఆకలితోనే పస్తులు ఉండాల్సి వస్తోందని వాపోయారు.

గతంలో కూడా ఆహార నాణ్యత లోపాల కారణంగా కొందరు విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన ఘటనలు చోటుచేసుకున్నాయని విద్యార్థులు గుర్తు చేశారు. మెస్ నిర్వహణలో నిర్లక్ష్యంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని వారు ఆరోపించారు.

ఇదిలా ఉండగా, ఘటనపై యూనివర్సిటీ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలిపారు. వాస్తవ పరిస్థితులను నిర్ధారించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more