Post Views: 18
మహాకవి శ్రీశ్రీ 43వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించిన సాహితీ, సాంస్కృతిక సంస్థలు..
నిజామాబాద్, జూన్ 14: మహాకవి శ్రీశ్రీ 43వ వర్ధంతి సందర్భంగా ఆల్ పెన్షనర్స్ భవన్‌లో ప్రజానాట్యమండలి, అరుణోదయ, అరుణోదయ ఇందూరు సాంస్కృతిక కళావేదికతో పాటు పలు సాహితీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన స్మారక సభ ఘనంగా జరిగింది.
ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు సిర్పలింగం అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ, “శ్రీశ్రీ ఒక వ్యక్తి కాదు… ఒక శక్తి” అని పేర్కొన్నారు. తన కవిత్వం, రచనల ద్వారా సమాజ చైతన్యానికి, అభ్యుదయ ఉద్యమాలకు, విప్లవ రచయితల ఉద్యమాలకు శ్రీశ్రీ అపారమైన స్ఫూర్తిని అందించారని కొనియాడారు. యువతను ఆలోచింపజేసి, సమాజ మార్పు దిశగా ఉరకలు వేయించిన కవి శ్రీశ్రీ అని అన్నారు.
జమాతే ఇస్లాం ప్రతినిధి హుస్సేన్ మాట్లాడుతూ, నేటి పరిస్థితుల్లో శ్రీశ్రీ వంటి సాహిత్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు. యువత పక్కదారి పట్టకుండా మానవతా విలువలను అలవరుచుకునేందుకు శ్రీశ్రీ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. కుల, మత భేదాలకు అతీతంగా మానవత్వాన్ని చాటిచెప్పిన మహాకవి శ్రీశ్రీ సాహిత్యాన్ని అందరూ అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.
సభలో మానవ హక్కుల నాయకులు గంగులు, అరుణోదయ గంగన్న, అరుణోదయ సాయిరెడ్డి, కామారెడ్డి నుంచి వచ్చిన రెడ్డి రాజయ్య, ఈవీయల్ తదితరులు వేదికను అలంకరించారు. పురుషోత్తంరావు తన కవిత్వాన్ని వినిపించగా, శ్రీలత శ్రీశ్రీ గారి సినీ, సాహిత్య గేయాలను ఆలపించారు. శ్రీనివాస్, షాదుల్లా తమ గాన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో కవులు, గాయకులు, కళాకారులు, మేధావులు, సాహితీ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో చరణ్ సభకు ముగింపు పలికారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








