ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ – అమరవీరుల త్యాగాలకు నివాళి..
బోధన్, జూన్ 2 (వార్త):
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో విజయకుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విట్ఠల్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జాదవ్ కృష్ణ జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అధికారులు మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత వ్యవసాయం, సాగునీటి రంగం, విద్య, వైద్యం, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి పౌరుడు తనవంతు బాధ్యత నిర్వర్తించాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







