June 2, 2026 11:54 pm

V1News Telangana

సాలూరలో సాకారమైన సొంతింటి కల – ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పేద కుటుంబాలకు భద్రమైన నివాసం కల్పించడమే లక్ష్యం – లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు..

నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని సాలూర గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు రిబ్బన్ కట్ చేసి గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా శాశ్వత నివాసం కల్పించడం సంతోషకరమైన విషయమని పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు

దోహదపడుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నవాజ్, సర్పంచ్ సభ్యురాలు లావణ్య రవి, సొసైటీ చైర్మన్ అల్లే జనార్ధన్, గ్రామ పెద్ద ఇల్తేపు శంకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మైదాపు నాగరాజు, రాహుల్ లక్ష్మణ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
కొత్త ఇంట్లో ఆనందంగా జీవనం సాగించాలని లబ్ధిదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more