May 21, 2026 10:57 pm

V1News Telangana

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు..

బోధన్ మే 21 : బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఆధునిక సాంకేతిక రంగానికి పునాది వేసిన మహానేత అని కొనియాడారు. దేశ అభివృద్ధిలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పాషా మోహినుద్దీన్, హరికాంత్ చారి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, ఐరెన్ల శంకర్, రవి, ఇమ్రాన్ షరీఫ్, అహ్మద్, తల్లరి నవీన్, రామ్మూర్తి, శ్రీనివాస్ రెడ్డి, అక్షయ్ పటేల్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Naveen Naveen
Author: Naveen Naveen

Leave a Comment

Read more
Read more