May 8, 2026 6:01 pm

V1News Telangana

బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా తూము శరత్ రెడ్డి ఎన్నిక

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కె. నగేష్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాషా మోహినుద్దీన్‌తో పాటు తూము శరత్ రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను కలిసి అధికారిక లేఖను సమర్పించారు.
ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన తూము శరత్ రెడ్డికి పార్టీ నాయకులు, కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు అంకు దాము, రవి, రామరాజు, జహీర్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more

శుక్రవారం:08:మే :2026.1. లైన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ సభ్యులకు రీజినల్ అవార్డ్స్ ప్రదానం 2. ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం – మందర్నా లబ్ధిదారుల ఆనందం 3. బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా తూము శరత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక 4. “మన ఇసుక – మన వాహనం” సేవలు మే 8 నుంచి ప్రారంభం – తహసీల్దార్ నవాజ్