:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “మన ఊరు – మన భద్రత – మన బాధ్యత” కార్యక్రమం బోధన్ డివిజన్ పరిధిలోని కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించేందుకు నిర్వహించబడింది. ఈ కార్యక్రమం బోధన్‌లోని శ్రీ లయన్స్ క్లబ్‌లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్ – 2026” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని, వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. వ్యవసాయదారులు రహదారులపై ధాన్యం ఆరబెట్టేటప్పుడు భద్రతా సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు.
యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆన్లైన్ బెట్టింగ్ వంటి అక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అధిక వేగం, అలసటతో డ్రైవింగ్, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు.
జిల్లాలో ప్రమాదాల తీవ్రతను ప్రస్తావిస్తూ, 2020లో కరోనా సమయంలో సుమారు 200 మంది మృతి చెందగా, 2025లో రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు 302 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అదే సమయంలో 47 హత్యలు నమోదయ్యాయని పేర్కొంటూ, రోడ్డు ప్రమాదాలు పెద్ద ప్రమాదంగా మారుతున్నాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ శ్రీ మస్తాన్ అలీ, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తూము పద్మ శరత్ రెడ్డి, వైస్ చైర్మన్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







