April 17, 2026 4:15 am

V1News Telangana

ఉషోదయ విద్యార్థుల ప్రతిభకు పోలీస్ కమిషనర్ ప్రశంసలు – ట్రాఫిక్ అవగాహనపై ప్రతిజ్ఞ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్, ఏప్రిల్ 15:

బోధన్ మండల కేంద్రంలోని ఉషోదయ ఇంటర్మీడియట్ మహిళా కళాశాల విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలకు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అభినందనలు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ తదితర కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బోధన్ డిగ్రీ కాలేజీలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చడం ప్రతి విద్యార్థి బాధ్యత అని, చిన్నప్పటి నుంచే కష్టపడే అలవాటు పెంపొందించుకుంటే జీవితంలో విజయాలు సాధించడం సులభమవుతుందని సూచించారు.
తదుపరి రమాకాంత్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కాలేజీ వార్షికోత్సవంలో పాల్గొన్న కమిషనర్, విద్యార్థులతో కలిసి “Arrive Alive” ట్రాఫిక్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
అలాగే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ నియంత్రణలో మరియు నేరాల నివారణలో విద్యార్థుల పాత్ర ముఖ్యమని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉషోదయ డిగ్రీ కాలేజీ చైర్మన్ ప్రకాష్, డైరెక్టర్ దుష్వంత్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌ఓ వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more