CCS & బోధన్ పోలీసుల సంయుక్త దాడి – కోచ్ వేషంలో యువతను మోసం చేసిన ప్రధాన నిందితుడు అరెస్ట్…
బోధన్ టౌన్ పోలీస్ పరిధిలోని ఆనీసానగర్ కాలనీలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రాకెట్‌ను CCS మరియు బోధన్ పోలీసులు సంయుక్తంగా వెలికితీశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు దాడులు నిర్వహించగా, షేక్ ఇలియాస్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఇలియాస్ తన మొబైల్ ఫోన్ ద్వారా వివిధ యాప్‌లను ఉపయోగించి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ కోచ్‌గా పనిచేస్తూ యువతలో నమ్మకం సంపాదించిన అతను, నిజామాబాద్‌కు చెందిన జునైద్ ప్రోద్బలంతో బెట్టింగ్ ఏజెంట్‌గా మారినట్లు విచారణలో వెల్లడైంది.
అమాయక యువకులను “తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు” అనే మాయమాటలతో బెట్టింగ్‌లోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు కూడా సమాచారం లభించింది.
అదేవిధంగా, అజర్ అనే వ్యక్తి బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి ఇప్పటివరకు సుమారు రూ. 45,55,545/- విలువైన ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో నిందితుడు షేక్ ఇలియాస్ వద్ద నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు, రెండు బ్యాంక్ పాస్‌బుక్కులు స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్‌కు తరలించారు.
👉 ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








