మోస్రా మరియు నిజామాబాద్ మధ్యలో ఉన్న కొత్తపేట గ్రామంలో జూదం విపరీతంగా పెరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని చెరువు పక్కనుండి వెళ్లే దారి, మామిడి తోట సమీపంలోని కొండ ప్రాంతంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇక్కడ ‘అందర్-బహర్’ వంటి జూద ఆటల ద్వారా నిమిషాల్లోనే వేల రూపాయలు, గంటల్లో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జూదానికి బానిసైన కొందరు వ్యక్తులు ఇంటి పరిస్థితులను పట్టించుకోకుండా, భార్యలపై హింసకు దిగుతూ, వారి బంగారు నగలను కూడా అమ్మి డబ్బులు తెచ్చి జూదంలో ఖర్చు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ జూదం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు జూదం నిర్వహిస్తున్న వారి ఆదాయం లక్షల్లో పెరుగుతున్నప్పటికీ, అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

నామమాత్రంగా కేసులు నమోదు చేసి, చిన్నపాటి జరిమానాలు వేసి వదిలేయడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదని, జూదం నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist







