June 21, 2026 8:09 pm

V1News Telangana

Big Breaking : 22న ఆర్టీసీ సమ్మె ‼️

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

  • ప్రభుత్వంలో విలీనం చేయండి
  • కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలి
  • 22 నుంచి బస్సులు బంద్ కు పిలుపు
  • ప్రభుత్వానికి 32 డిమాండ్లు
  • ఆర్టీసీ కార్మికులపై పట్టింపు లేదని జేఏసీ నేతల ఆవేదన

హైద్రాబాద్ న్యూస్ డెస్క్ :- తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు రెడీ అయ్యారు. ఈనెల 22 నుంచి సమ్మె సైరన్ మోగించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ, ఆర్టీసీ యాజమాన్యం నుంచి గానీ ఎలాంటి రియాక్షన్ లేదని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. దీంతో సమ్మె బాట పట్టక తప్పలేదని వెల్లడించింది. 32 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక సమ్మెకు దిగాల్సి వస్తుందని పేర్కొంది.

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్‌ మోగించారు. ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నట్లు తాజాగా ఆర్టీసీ జేఏసీ ప్రకటన విడుదల చేసింది. గత నెల 13వ తేదీన సమ్మె నోటీసులు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆర్టీసీ జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి వెల్లడించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. సమ్మె నివారణ చర్యలను చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం ముందు ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లను ఉంచినట్లు స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు.. కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా తమకు కూడా సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్‌ చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చినట్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె నోటీసులు ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమై చర్చించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి సానుకూలంగా స్పందించాలని కోరారు.

ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురి వెంకన్న డిమాండ్ చేశారు. ఆర్టీసీని విస్తరించడం మంచిదేనని.. అయితే ఆ పేరుతో సంస్థను నిర్వీర్యం చేయొద్దని కోరారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని.. అయితే అలా చేయడం వల్ల గుత్తేదారుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని.. అందువల్ల వాటిని ప్రభుత్వమే నిర్వహించాలని సూచించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more