సాలూర మండలంలో భారీ నష్టం – రైతులకు తక్షణ పరిహారం కోరుతూ కలెక్టర్‌కు వినతి
నిజామాబాద్, ఏప్రిల్ 7:
సాలూర మండలంలోని హున్స, మందర్న, ఖాజాపూర్ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వడగళ్ల వాన రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది. సాగులో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతిని, ఇప్పటికే అప్పుల బారిన ఉన్న రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఒక్కసారిగా వచ్చిన ఈ ప్రకృతి విపత్తు రైతుల ఆశలను ఛిద్రము చేసింది.
ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని కోరుతూ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి నాయకత్వంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి (ఎంపీఆర్) మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం గమనించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
పంట నష్టం జరిగిన రైతులకు సరైన పరిహారం అందించకపోతే బీజేపీ రైతుల పక్షాన బలమైన ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు గంగాధర్, సరిన్, ఇంద్రకరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు కందికట్ల రాంచందర్, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు మరియు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







