హైదరాబాద్ న్యూస్ డెస్క్ :-
బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింది నుండి టన్నెల్ తవ్వడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి ఇంకా ఇవ్వకున్నా, తమకు అనుమతి లభించిందని ఇటీవల తెలంగాణ శాసనమండలిలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది సభను తప్పుదోవ పట్టించడం కిందికి వస్తుందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి జాతీయ భద్రతా కారణాల రీత్యా రన్‌వే కింద టన్నెల్ తవ్వడం అత్యంత ప్రమాదకరం మరియు చాలా రిస్క్‌తో కూడుకున్న పని

రన్‌వే మీద అత్యంత బరువైన విమానాలు వెళ్తాయి కాబట్టి కింద టన్నెల్ తవ్వాలంటే అత్యంత పటిష్టమైన స్ట్రక్చర్, మరియు విదేశీ టెక్నాలజీ ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఎయిర్‌పోర్టులకు ఉండే భద్రతా కారణాల రీత్యా అసలు ఈ ప్రాజెక్టు ఏమాత్రం ఆచరణసాధ్యం కాదని ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు.
మూసారాంబాగ్ వద్ద మూసీ నది మీద కడుతున్న బ్రిడ్జిని మూడేళ్లుగా ముక్కి మూలిగి 35% మాత్రమే కట్టగలిగిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రన్‌వే కిందనుండి టన్నెల్ వంటి సాహసాలు చేయకపోవడమే మంచిదని వారు హెచ్చరిస్తున్నారు.
గత నెల శాసన మండలిలో మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తమకు రన్‌వే కింది నుండి టన్నెల్ తవ్వడానికి అనుమతి ఇచ్చేసింది అని రేవంత్ రెడ్డి చాలా కాన్‌ఫిడెంట్‌గా చెప్పారు.
కానీ నిన్న మీడియా వారితో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తాము ఇంకా అలాంటి అనుమతులు ఇవ్వలేదని. తాము ఇవ్వకముందే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అని ప్రచారం చేసుకోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
దేశంలో ఇప్పటి వరకూ ఎక్కడా రన్‌వే కింది నుండి టన్నెల్ వేసి హైవేను నిర్మించడానికి అనుమతులు ఇవ్వలేదని. కాబట్టి అన్ని కోణాల నుండి ఆలోచించాకనే అటువంటి అనుమతి ఇస్తామని సదరు అధికారులు అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు కోరుతూ ఒక విజ్ఞాపన అందిందని, కానీ దానిమీద నిర్ణయం తీసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు.
నిజాలు ఇలా ఉంటే, ఏకంగా ముఖ్యమంత్రే శాసన మండలిలో అనుమతులు వచ్చేశాయని తప్పుడు సమాచారం ఇవ్వడం సభా మర్యాదలకు, సాంప్రదాయాలకు విరుద్ధం అని న్యాయనిపుణులు అంటున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






