June 22, 2026 12:54 am

V1News Telangana

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం – ప్రజావాణిలో 32 ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రతి సోమవారం ప్రజలకు నేరుగా సేవలు – నిర్భయంగా ముందుకు రావాలని పోలీసుల పిలుపు..
నిజామాబాద్, ఏప్రిల్ 6:

ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తోందని పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.
సోమవారం నిర్వహించిన “ప్రజావాణి” కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన స్వయంగా హాజరై ఫిర్యాదిదారుల సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి మొత్తం 32 ఫిర్యాదులను స్వీకరించారు.
ప్రతి ఫిర్యాదును పరిశీలించి, చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. కొన్ని సమస్యలపై వెంటనే స్పందిస్తూ సంబంధిత పోలీస్ స్టేషన్‌ల ఎస్‌.ఐలు, సి.ఐలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల స్థితిగతులను తెలుసుకుని తగిన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి భయం లేకుండా, మూడో వ్యక్తులపై ఆధారపడకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవలను వినియోగించుకుని తమ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని కోరారు.
ప్రజలకు మరింత చేరువ కావడం, శాంతి భద్రతలను కాపాడడం, ప్రతి ఫిర్యాదుకు న్యాయం చేయడం జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి సోమవారం నిర్వహించే “ప్రజావాణి” కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటికి తక్షణ పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more