నిజామాబాద్, ఏప్రిల్ 6:
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS ఆదేశాల మేరకు అక్రమ మొరం తవ్వకాలపై CCS (క్రైమ్ కంట్రోల్ శాఖ) బృందం మెరుపుదాడి నిర్వహించింది.
CCS ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సిబ్బంది నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుగుట్ట వెనుక భాగంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు అందిన సమాచారంపై అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు.
ఈ దాడిలో అక్రమ తవ్వకాల కోసం ఉపయోగిస్తున్న
3 టిప్పర్లు, 2 జేసీబీ యంత్రాలు, 1 ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసిన వాహనాలను తదుపరి చర్యల కోసం నందిపేట్ పోలీస్ స్టేషన్ SHOకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య గారు హెచ్చరించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








