June 22, 2026 12:58 am

V1News Telangana

🥚 గుడ్లపై కొత్త నిబంధనలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

గుడ్లపై కొత్త నిబంధనలు: తేదీ ముద్ర తప్పనిసరి
తాజా గుడ్డు గుర్తింపు ఇక సులభం
పింక్–బ్లూ మార్కింగ్‌తో గుడ్ల తాజాదనానికి హామీ
డేట్ లేని గుడ్ల విక్రయానికి చెక్
వినియోగదారుల ఆరోగ్యానికి యూపీ కీలక నిర్ణయం
గుడ్లపై పారదర్శకతకు కొత్త విధానం..

ప్రతి రోజు వినియోగించే కోడిగుడ్డు ఎంత తాజాగా ఉందో తెలుసుకోవడం ఇకపై సామాన్య వినియోగదారుడికీ సులభం కానుంది. గుడ్ల విక్రయాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా గుడ్లపై ఉత్పత్తి తేదీ (Production Date), గడువు తేదీ (Expiry Date) ముద్రించడం తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
ఈ నిబంధనల ప్రకారం, హోల్‌సేల్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, రిటైల్ కేంద్రాల్లో విక్రయించే ప్రతి గుడ్డుపై తేదీ వివరాలు స్పష్టంగా ఉండాలి. తేదీ ముద్ర లేని గుడ్లను విక్రయిస్తే వాటిని వినియోగానికి అనర్హంగా ప్రకటించి, అక్కడికక్కడే ధ్వంసం చేయనున్నారు. వినియోగదారుల ఆరోగ్య రక్షణతో పాటు సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంచడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ఇక గుడ్ల నిల్వ విధానాన్ని బట్టి ప్రత్యేక రంగు గుర్తులు కూడా ప్రవేశపెట్టారు. సాధారణ గది ఉష్ణోగ్రత (సుమారు 30°C)లో నిల్వ చేసిన గుడ్లపై పింక్ రంగుతో తేదీలు ముద్రించాలి. ఈ గుడ్లను రెండు వారాల్లోపు వినియోగించాలి. కోల్డ్ స్టోరేజ్ (2–8°C)లో ఉంచిన గుడ్లపై బ్లూ రంగు ముద్ర ఉంటుంది. ఇవి ఐదు వారాల వరకు తాజాగా ఉంటాయి. ఈ గుర్తుల కోసం ఉపయోగించే ఇంక్ పూర్తిగా ఫుడ్-గ్రేడ్‌ కావడంతో ఆరోగ్యానికి హాని ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. నిబంధనలు ఉల్లంఘించిన పౌల్ట్రీ ఫారాలు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటూ భారీ జరిమానాలు విధించనున్నారు.
దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 138 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులోకి వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
ఫిట్‌నెస్ ప్రేమికులు, ప్రోటీన్ ఆహారం తీసుకునే వారు అధికంగా ఉన్న నగరాల్లో ఈ నిర్ణయానికి మంచి స్పందన లభిస్తోంది. తాజా గుడ్లను గుర్తించడం సులభం కావడంతో వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more