గ్యాస్ ఏజెన్సీపై బోధన్ వినియోగదారుల ఆగ్రహం
Bodhan పట్టణంలోని గోశాల ప్రాంతంలో ఉన్న దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు డోర్ డెలివరీ చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. బుకింగ్ అనంతరం వినియోగదారులకు ఓటీపీ వచ్చినప్పటికీ సిలిండర్ మాత్రం అందలేదని తెలిపారు.
ఇప్పటికే ఆరు రోజులు గడిచినా గ్యాస్ సిలిండర్ అందకపోవడంతో గృహిణులు, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏజెన్సీ నిర్వాహకుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికీ గ్యాస్ డోర్ డెలివరీ చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఇది వాస్తవానికి విరుద్ధమని, తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
గ్యాస్ లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇటువంటి ఏజెన్సీలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







